నావల్నీని రిలీజ్ చేద్దామనుకున్నాం.. ప్రత్యర్థి మృతిపై పుతిన్‌ తొలి స్పందన

-

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తొలిసారి తన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మృతిపై తొలి సారి స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే అంతలోనే ఆయన మరణించారని పేర్కొన్నారు. తాజాగా రష్యా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఖాయమైన అనంతరం ప్రసంగిస్తూ ఇవాళ రోజున పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లలో ఆయన నావల్నీ పేరెత్తడం ఇదే తొలిసారి.

ఖైదీల మార్పిడి కింద నావల్నీని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకు తీసుకొద్దామనే ఆలోచనను సహచరులు తన ముందుంచారని పుతిన్ అన్నారు. మీరు నమ్ముతారో.. లేదో.. ఆ వ్యక్తి తన మాటల్ని ముగించకముందే తన అంగీకారాన్ని తెలియజేశానని చెప్పారు. అయితే, నావల్నీ తిరిగి రష్యాకు రావొద్దనే షరతు విధించానన్న పుతిన్.. అంతలోనే ఆయన మరణ వార్త వినాల్సి వచ్చిందని తెలిపారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇది జీవితం అని పుతిన్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version