వాళ్లను వదిలే ప్రసక్తే లేదు.. మాస్కో ఉగ్రదాడిపై పుతిన్ స్పందన

-

రష్యా రాజధాని మాస్కోలని ఓ మ్యూజిక్ కన్సర్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 137 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఈ దుర్ఘటపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఈ దాడికి పాల్పడిన ముష్కరులు ఉక్రెయిన్‌కు పారిపోయే ప్రయత్నంలో పట్టుబడ్డారని పుతిన్‌ తెలిపారు. అయితే ఈ ఘటనతో తమకేమాత్రం ప్రమేయం లేదని ఉక్రెయిన్‌ తోసిపుచ్చుతుండగా పుతిన్ ఈ ప్రకటన చేశారు.

అఫ్గాన్‌కు చెందిన ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు ఈ కాల్పులకు తామే తెగబడినట్లు చెప్పినా.. పుతిన్ మాత్రం ఈ పేరు ప్రస్తావించలేదు. కాల్పుల ఘటనలో 11 మందిని అదుపులో తీసుకున్నట్లు పుతిన్‌ వెల్లడించారు. ఈ దాడిని రక్తపాత, అనాగరిక ఉగ్రచర్యకు పాల్పడిన అనుమానితులు నలుగురూ ఉక్రెయిన్‌ వైపు ముందే సిద్ధం చేసుకున్న మార్గం ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నించగా తమ బలగాలు పట్టుకున్నాయని చెప్పారు. మరోవైపు ఈ ఘటనలో మొత్తం 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news