ఇండియా కు రానున్న ర‌ష్యా అధ్య‌క్షుడు

-

భార‌తదేశ ప‌ర్య‌ట‌నకు రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధం అవుతున్నారు. డిసెంబ‌ర్ నెల‌లో 6 వ తేది న వ్లాదిమిర్ పుతిన్ భార‌త్ కు రానున్న‌ట్టు మ‌న దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ప‌ర్య‌ట‌న భార‌త్ ర‌ష్యా దేశాల మధ్య ప్ర‌తి ఏడాది జ‌రిగే వార్షిక స‌మావేశం లో భాగం గా ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా ప‌ర్య‌ట‌న కు రానున్నాడు. ఈ ప‌ర్య‌ట‌న లో మ‌న దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ మ‌ధ్య కీల‌క స‌మావేశం ఉంటుద‌ని తెలుస్తుంది.

అయితే ర‌ష్యా, భార‌త్ దేశాల మ‌ధ్య ద్వైపాక్షి సంబంధాలు చాలా బలంగా ఉంటాయి. ఈ రెండు దేశాలు వ్యూహాత్మ‌క సంబంధాల తో ముందుకు వెళ్తాయి. కాగ భార‌త్ కు రక్ష‌ణ ప‌రంగా ర‌ష్యా చాలా స‌హ‌కార‌లు చేసింది. అయితే మోడీ పుతిన్ ల మ‌ధ్య జ‌రిగే స‌మావేశంలో క్షిప‌ణీ విధ్వంస‌క వ్య‌వ‌స్థ S – 400 స‌ర‌ఫ‌రా పై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే కొన్ని స‌మ‌స్య‌ల వ‌ల్ల S – 400 స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. ఈ స‌మావేశంతో ఈ అడ్డంకులు అన్నీ కూడా తొల‌గి పోయే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news