దుబాయ్ ప్ర‌ధానికి షాక్.. భార్య కు రూ. 5555 కోట్లు భ‌ర‌ణం

దుబాయ్ ప్ర‌ధాని షేక్ మొహ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ ముక్త‌మ్ కు లండ‌న్ హై కోర్టు షాక్ ఇచ్చింది. అల్ ముక్తూమ్ మాజీ భార్య యువ‌రాణి హ‌యా బింట్ అల్ హుస్సేన్ కు రూ. 5555 కోట్లు భ‌ర‌ణం చెల్సించాల్సిందేన‌ని తీర్పు ను ఇచ్చింది. అంతే కాకుండా ముందుగా రూ. 2,516 కోట్లు చెల్లించాల‌ని తీర్పు ఇచ్చింది. అలాగే మిగిలిన మొత్తాన్ని మూడు ద‌ఫాల‌లో చెల్లించాల‌ని ఆదేశించింది. అలాగే కోర్టు ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు ఇద్ద‌రు పిల్ల‌ల‌కు వారి జీవితాంతం భ‌ద్ర‌తా ఖ‌ర్చుల‌ను భరించాల‌ని తెలిపింది.

 

కాగ ఆల్ ముక్తూమ్ ఆరోవ భార్య అయిన హ‌యా బింట్ అల్ హుస్సేన్ గ‌త కొద్ది రోజుల ముందు జ‌ర్మ‌నీ కి పారిపోయింది. అక్క‌డ నుంచి విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంది. జ‌ర్మ‌నీ దేశ ప్ర‌భుత్వాన్ని ఆశ్ర‌యించింది. అక్క‌డ నుంచి వీరి విడాకులు అయ్యాయి. కాగ ఈ విడాకులు ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన విడాకులు గా ఉన్నాయి. గ‌తంలో చాలా మంది ప్ర‌ముఖులు విడాకులు తీసుకున్నారు. కానీ ఇంత మొత్తం భ‌ర‌ణం చెల్లించ‌లేదు.