చైనా తర్వాత సింగపూరే… భారీగా కేసులు నమోదు…!

-

సింగపూర్… అమెరికాకు ధీటైన అభివృద్ధి. జనాభా తక్కువే అయినా సరే ప్రపంచంలో ఈ దేశం సాధించిన విజయాలు ఏ దేశం కూడా ఇప్పటి వరకు సాధించలేదు. అతి తక్కువ జనాభా ఉన్న దేశం ఆసియాలో ఇది ఒక్కటే. కాని ఆ దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. అసలు కేసులు లేవు అనుకుని లాక్ డౌన్ ని ఎత్తేసింది ఆ దేశం. ప్రతీ రోజు అక్కడ వందల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.

ఈ దేశంలో ఆదివారం 931 కొత్త కేసులను గుర్తించారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య ఆ దేశంలో 13 వేలు దాటింది. ఆసియా దేశాల్లో చైనా భారత్ లో మాత్రమే అత్యధిక కేసులు ఉండగా సింగపూర్ లో ఇప్పుడు కేసుల వేగం పెరుగుతుంది. వసతి గృహాలలో నివసిస్తున్న వలస కార్మికులలో ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. తమ దేశంలో కేవలం 15 మందికి మాత్రమే కరోనా సోకింది అని ఆ దేశం చెప్పింది.

సుమారు 5.7 మిలియన్ల జనాభా ఉన్న దేశం అది. లాక్ డౌన్ ని జూన్ 1 వరకు ఆ దేశం పెంచింది. స్కూల్స్ ని కూడా పూర్తిగా మూసివేసింది. అనవసరమైన వ్యాపారాలను మూసి వేసింది ఆ దేశం. విదేశీ కార్మికులు వసతి గృహాలు దాటి రావొద్దు అని చెప్పింది. ఆ దేశం లో పటిష్ట ఆర్ధిక వ్యవస్థ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అది కుప్ప కూలిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఆ దేశంలో కేవలం 12 మందే కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆసియాలో చైనా తర్వాత ఎక్కువగా కరోనా బారిన పడే దేశం సింగపూర్ అని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version