మాంసం దుకాణంపై బాంబుల దాడి.. ఆరుగురు దుర్మరణం

-

ఓ మాంసం దుకాణం వద్దకు బాంబులతో కూడిన వాహనం దూసుకొచ్చిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమాలియా దేశంలో చోటుచేసుకుంది. సెంట్రల్ సోమాలియాలో ఒక్క రోజులోనే ఇది మూడో ఘటన అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదని చెప్పారు.

గురువారం రోజున సోమాలియాలో బాంబుల వర్షం కురిసింది. ఉదయం హిరాన్​ పరిధిలోని రెండు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఆ తర్వాత మాంసం దుకాణం వద్దకు సూసైడ్ కార్ బాంబు దూసుకొచ్చి ఆరుగులు ప్రాణాలు బలితీసుకుంది. అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపేందుకు ప్రయత్నించిన ముగ్గురు సైనికులను దుండగులు కాల్చిచంపారు. మార్కెట్​కు సమీపంలోని ఆర్మీ కమాండర్ ఇంటిని లక్ష్యంగా చేసుకునే.. ఈ దాడికి ప్రయత్నించారని అధికారులు అనుమానిస్తున్నారు.

శనివారం రోజున భద్రతా చెక్‌పోస్టు వద్ద జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కు.. ప్రభుత్వం ఆధీనంలోని చెక్​పోస్ట్​పైకి దూసుకువచ్చిందని ప్రత్యక్ష సాక్షి అబ్దికదిర్ అర్బా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news