ఓ మాంసం దుకాణం వద్దకు బాంబులతో కూడిన వాహనం దూసుకొచ్చిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమాలియా దేశంలో చోటుచేసుకుంది. సెంట్రల్ సోమాలియాలో ఒక్క రోజులోనే ఇది మూడో ఘటన అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదని చెప్పారు.
గురువారం రోజున సోమాలియాలో బాంబుల వర్షం కురిసింది. ఉదయం హిరాన్ పరిధిలోని రెండు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఆ తర్వాత మాంసం దుకాణం వద్దకు సూసైడ్ కార్ బాంబు దూసుకొచ్చి ఆరుగులు ప్రాణాలు బలితీసుకుంది. అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపేందుకు ప్రయత్నించిన ముగ్గురు సైనికులను దుండగులు కాల్చిచంపారు. మార్కెట్‌కు సమీపంలోని ఆర్మీ కమాండర్ ఇంటిని లక్ష్యంగా చేసుకునే.. ఈ దాడికి ప్రయత్నించారని అధికారులు అనుమానిస్తున్నారు.
శనివారం రోజున భద్రతా చెక్‌పోస్టు వద్ద జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కు.. ప్రభుత్వం ఆధీనంలోని చెక్‌పోస్ట్‌పైకి దూసుకువచ్చిందని ప్రత్యక్ష సాక్షి అబ్దికదిర్ అర్బా చెప్పారు.