ల్యాండింగ్ సమయంలో పల్టీలు కొట్టిన విమానం.. 15 మందికి తీవ్రగాయాలు..!

-

కెనడా లోని టొరంటో ఎయిర్పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం పల్టీలు కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్టు సిబ్బంది క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి సంబంధించిన అంశాల పై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల వరుస విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ చూస్తుంటే ప్రజలు విమానాల్లో ప్రయాణించేందుకే గజగజా వణికిపోతున్నారు. గత పది రోజుల్లోనే మొత్తంగా నాలుగు విమాన ప్రమాదాలు సంభవించగా.. దాదాపు 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల యూఎస్ లోని ఆరిజోనా స్కాటేల్, విమానాశ్రయంలో రెండు ప్రైవేటు జెట్లు ఢీకొనగా.. ఓ వ్యక్తి మృతి చెందాడు. అలాగే మరో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను మరువకముందే కెనడాలో ల్యాండింగ్ సమయంలో విమానం పల్టీలు కొట్టడం ప్రయాణికులకు భయాందోళనకు గురిచేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news