‘ట్రంప్’కు తన భార్య పేరే గుర్తు లేదు.. బైడెన్ విమర్శలు

-

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రెండోసారి ఆ పీఠం కోసం పోటీపడుతోన్న విషయం తెలిసిందే. బైడెన్‌కు వయసురీత్యా వచ్చే ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ప్రత్యర్థులు తనపై చేస్తున్న విమర్శలు తిప్పికొడుతూనే తాజాగా తన ప్రధాన పోటీదారు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ విమర్శలు గుప్పించారు. ట్రంప్ తన భార్య పేరే మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ట్రంప్ తన సతీమణిని వేరే పేరుతో పిలిచారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికను బైడెన్ ప్రస్తావించారు. లేట్‌నైట్ విత్ సేథ్‌ మేయర్స్‌ షోలో పాల్గొన్న బైడెన్ ఈమేరకు స్పందించారు.

‘మీరుట్రంప్‌ను పరిశీలించాలి. ఆయనకు కూడా దాదాపు నా వయసే. ఆయన తన భార్య పేరును గుర్తుంచుకోలేరు. అలాగే ఆయన ఆలోచనలన్నీ కాలం చెల్లినవి.’ అని బైడెన్ అన్నారు. అయితే ట్రంప్ తన భార్యను వేరే పేరుతో పిలిచారా..? లేక తన మాజీ సహాయకుల్లో ఒకరిని అలా పిలిచారా..? అనే దానిపై స్పష్టత లేదు.

వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఓ కీలక నివేదిక ఇటీవల వెలుగులోకి వచ్చింది. 81 ఏళ్ల వయసున్న బైడెన్‌కు జ్ఞాపకశక్తి చాలా ‘మసక’గా ఉందని పేర్కొంది. ఈ నివేదికను ఆయన తీవ్రంగా ఖండించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version