భయంలో ట్విట్టర్ ఉద్యోగులు.. ఎందుకంటే..?

-

ప్రపంచ కుబేరుడు.. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకుట్టానని చెప్పినట్లుగానే.. తన సొంతం చేసుకున్నారు. అయితే.. దీంతో ట్విట్టర్ ఉద్యోగుల్లో భయం నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో ట్విట్టర్ ఉద్యోగులు భయంభయంగా గడుపుతున్నారు. దాదాపు 4,400 కోట్ల డాలర్లతో ట్విట్టర్‌లోని షేర్లన్నింటినీ మస్క్ ఇటీవల సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని ట్విట్టర్ ఉద్యోగుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. అంతేకాదు, శుక్రవారం కంపెనీ అంతర్గత టౌన్‌హాల్‌ మీటింగులో ఇదే విషయమై ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను ఉద్యోగులు నిలదీసినట్టు సమాచారం.

మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లాక కంపెనీలో సామూహిక వలసలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలంటూ పరాగ్‌ను ఉద్యోగులు నిలదీసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించిన పరాగ్‌ అలాంటిదేమీ ఉండదని సమాధానం ఇచ్చినట్టు తెలిపింది. కాగా, ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం పూర్తైన తర్వాత ట్విట్టర్ ప్రైవేటు కంపెనీగా మారుతుంది. మరోవైపు, ట్విట్టర్ కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం మస్క్ ఈ వారంలో 850 కోట్ల డాలర్ల (రూ.65,025 కోట్లు) విలువైన టెస్లా షేర్లను విక్రయించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version