బ్రిటన్ లో ప్రమాద ఘంటలు మోగుతున్నాయి. బ్రిటన్ లో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటి వరకు బ్రిటన్ లో 160 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అక్కడ ప్రజలు బయటకు రావాలంటే నే జంకుతున్నారు. అలాగే బ్రిటన్ ప్రభుత్వం కూడా ఓమిక్రాన్ వేరియంట్ ను అడ్డు కోవడానికి తీవ్రం గా ప్రయత్నిస్తుంది. అందులో భాగం గా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు.
బ్రిటన్ కు వచ్చే ప్రతి ప్రయాణికుడు తప్పక ఆర్టీ పీసీఆర్ పరీక్ష నిర్వహించు కోవాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా అంతర్జాతీయ ప్రయాణికుల పై ఏకం గా నిషేధం విధించింది. అయితే బ్రిటన్ లో నమోదు అయిన కేసులలో అత్యధికం గా నైజీరియా తో పాటు దక్షిణా ఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారే అనే తెలుస్తుంది. దీంతో నైజీరియా దేశం నుంచి వచ్చిన వారిని ప్రత్యే కం గా హోటల్ గదు లకు తరలిస్తున్నారు. కాగ ఓమిక్రాన్ వేరియంట్ ఇంకా విస్తరిస్తుందని వైద్యులు భావిస్తున్నారు.