మరోసారి భీకర పోరు.. రష్యా సైనిక నౌకపై ఉక్రెయిన్ క్షిపణి దాడి

-

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కాస్త నెమ్మదించిందని అనుకునేలోగానే మరోసారి భీకర రూపు దాల్చింది. ఉక్రెయిన్‌లోని మరింకా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా పేర్కొనగా.. క్రిమియాలో రష్యాకు చెందిన యుద్ధ నౌకపై క్షిపణి దాడులు చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ దాడిలో నౌక భారీగానే దెబ్బతిన్నట్లు

మాస్కో సేనలు మరింకా పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ప్రకటన విడుదల చేశారు. రష్యా దాడుల ధాటికి మరింకాలో ఇళ్లు పూర్తిగా నేలమవ్వడం రష్యా వార్తాఛానెళ్లు విడుదల చేసిన వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. పట్టణమంతా శిథిలాల గుట్టగా మారింది. మాస్కో ప్రకటనపై ఉక్రెయిన్‌ ఇంకా స్పందించలేదు.

మరోవైపు క్రిమియాలో రష్యాకు చెందిన యుద్ధ నౌకపై క్షిపణి దాడులు చేయగా పోర్టు ప్రాంతమంతా నారింజ రంగులోకి మారిపోయింది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని.. ఆరు భవనాలు దెబ్బతిన్నట్లు క్రిమియా గవర్నర్ తెలిపారు. ఈ దాడిని రష్యా కూడా ధ్రువీకరిస్తూ.. ఉక్రెయిన్‌కు చెందిన రెండు ఫైటర్‌ జెట్లను తమ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్షిపణులు నేలకూల్చాయని తెలిపింది. రష్యా ప్రకటనను ఉక్రెయిన్ ఖండించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version