ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో నాన్ బైండింగ్ తీర్మానానికి UN ఆమోదం.. ఓటింగ్​కు భారత్ దూరం

-

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో సామాన్యులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యంత దయనీయ స్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులను చూసి ప్రపంచమంతా కంటతడి పెడుతోంది. ఇరు దేశాలు సంధి కుదుర్చుకుని ఈ మారణ హోమం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐరాస ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో మానవతా సంధికి పిలుపునిచ్చే నాన్ బైండింగ్ తీర్మానానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

అక్టోబరు 7వ తేదీన హమాస్ దాడుల తర్వాత ఐక్యరాజ్య సమితి తీసుకున్న మొదటి చర్య ఇది. ఇప్పటి వరకు ఇరు దేశాలకు మందలింపు.. బుజ్జగింపు మాత్రమే చేసిన యూఎన్.. తాజాగా ఆ దేశాల్లో జరుగుతున్న మారణకాండను చూసి చలించి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 193 మంది సభ్యులతో కూడిన ఐరాస జనరల్‌ అసెంబ్లీ.. 120-14 ఓట్లతో ఈ తీర్మానాన్ని ఆమోదించగా.. భారత్ సహా 45 దేశాలు ఓటింగ్​కు దూరంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version