రష్యాపై అమెరికా ఫైర్.. ప్రమాదకరమైన ఆట ఆడుతోందంటూ

-

జపోరిజియా అణు విద్యుత్కేంద్రం నుంచి రష్యా సేనలు వెంటనే వైదొలగాలని, దాని నిర్వహణను ఉక్రెయిన్‌కు అప్పగించాలని అమెరికా సూచించింది. ఈ కేంద్రంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి చేసిన నేపథ్యంలో స్పందించిన అమెరికా.. అక్కడి పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా పెద్ద ప్రమాదం సంభవించొచ్చని అమెరికా విదేశాంగ శాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

‘జపోరిజియా అణువిద్యుత్కేంద్రంపై డ్రోన్‌ దాడి సమాచారం తమ వద్ద ఉందన్న అగ్రరాజ్యం.. అక్కడి పరిస్థితులను తాము పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) నుంచి కూడా నివేదికలు అందాయని అమెరికా వెల్లడించింది. ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అణు కేంద్ర భద్రతకు ముప్పు లేదని తెలిసి ఊరట చెందామని పేర్కొంది. ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్కేంద్రాన్ని ఆక్రమించి రష్యా చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతోందని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ అన్నారు. అణు ప్రమాదం జరిగే ఎలాంటి చర్యలకూ పాల్పడొద్దని ఆయన రష్యాను హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version