నా భార్యతో పరిచయం అలా మొదలైంది: వివేక్‌ రామస్వామి

-

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ఇండో అమెరికన్‌ వివేక్‌ రామస్వామి ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. తాను అధికారంలోకి వస్తే అమెరికన్లకే ప్రాధాన్యమిచ్చే ఎన్నో కార్యక్రమాలు చేపడతానని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తాను అమెరికా అధ్యక్షుడైతే తన దేశం కోసం ఏం చేస్తాడనే ప్రణాళికలను ప్రజలకు స్పష్టంగా వివరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఫ్లోరిడాలోని ఓసియోలా కౌంటీలో జరిగిన ఓ సమావేశంలో వివేక్ తన భార్య అపూర్వతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ విలువల గురించి తన అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే అపూర్వను మొదటిసారి కలిసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తన వైవాహిక జీవితం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

తన భార్య అపూర్వను తాను ఎలా కలుసుకున్నానో తెలుసుకోవాలని చాలా మంది ఓటర్లు ఆశపడుతున్నారంటూ వివేక్ తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో వివేక్​ను ఎలా కలుసుకుందో అపూర్వ వివరించారు. వారిద్దరూ ఓ పార్టీలో కలిశారని ఆసమయంలో వివేక్ లా చదువుతున్నారని.. తాను ఓ కాలేజ్ స్టూడెంట్​ అని చెప్పారు. ఆ పార్టీలో వివేక్ ఒక్కరే తనకు ఇంట్రెస్టింగ్​గా కనిపించారని అలా ఆయనతో పరిచయం స్నేహంగా మారిందని తెలిపారు. చాలా కాలం పక్కపక్క ఇళ్లలోనే ఉన్న తాము చివరకు తల్లిదండ్రుల అనుమతితో పెళ్లి చేసుకున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news