ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర.. కొన్ని వారాల క్రితమే ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌!

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పై ఆదివారం రోజున హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. అయితే ట్రంప్ హత్యకు ఇరాన్‌ కుట్ర పన్నినట్లు ఆ దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ అందింది. దీంతో ఆయనకు సీక్రెట్‌ సర్వీస్‌ వెంటనే భద్రతను పెంచింది. ట్రంప్ అధికారంలో ఉండగా.. ఇరాన్‌ సుప్రీం కమాండర్‌ ఖాసిం సులేమానీని డ్రోన్‌ దాడిలో అమెరికా హతమార్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ట్రంప్‌నకు ఇరాన్‌ నుంచి బెదిరింపులు వస్తున్నాయి.

ఈ సందర్భంగా సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మి మాట్లాడుతూ.. ట్రంప్‌నకు పొంచి ఉన్న ముప్పునకు సంబంధించి తమకు నిరంతర సమాచారం అందుతోందని .. అందుకు అనుగుణంగా భద్రతా వనరులను సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు. ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన 20 ఏళ్ల యువకుడికి ఇరాన్‌ కుట్రతో ఎలాంటి సంబంధం లేదని ధ్రువీకరించారు. నిర్దిష్టంగా ఇరాన్ నుంచి ముప్పు తలెత్తినట్లు మాత్రం బహిరంగంగా ధ్రువీకరించలేమని వెల్లడించారు. అయితే, ప్రతి బెదిరింపును చాలా తీవ్రంగా పరిగణిస్తామని.. అంతే వేగంగా ప్రతిస్పందిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news