BREAKING : అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వివేక్‌ ఔట్‌

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పుకుంటున్న ప్రకటించారు. అయోవా ప్రైమరీలో నిరాశజనక ఫలితాలు వచ్చిన నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. అయోవాలోని డెస్ మోయినెస్లో విలేకరులతో మాట్లాడిన ఆయన- ట్రంప్ను గెలిపించేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని వెల్లడించారు.

అయోవా ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 51 శాతం ఓట్లతో స్పష్టమైన మెజారిటీ దక్కించుకున్నారు. 21.2 శాతం ఓట్లతో రెండో స్థానంలో రాన్ డిశాంటిస్, 19.1 శాతం ఓట్లతో నిక్కీ హేలీ మూడో స్థానంలో నిలిచారు. 7.7 శాతం ఓట్లతో వివేక్ రామస్వామి నాలుగో స్థానంలో నిలిచారు. ఈ ఫలితాలతో ఆయన తాజాగా రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలోకి దిగిన 38 ఏళ్ల రామస్వామి తన అద్భుతమైన ప్రసంగాలతో అమెరికా ప్రజలకు ఏది మేలు చేస్తుందో ఏది కీడు చేస్తుందో స్పష్టంగా చెబుతూ సంచలనంగా మారారు. ఏ అంశంపైనైనా నిక్కచ్చిగా మాట్లాడుతూ పాపులారిటీ పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news