‘ప్రపంచమంతా మా చట్టమే తెస్తాం’.. హమాస్‌ కమాండర్‌ ప్రకటన

-

ఇజ్రాయెల్​పై భీకర పోరు చేస్తున్న హమాస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఓవైపు గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు తీవ్రతరం చేస్తుండగా.. హమాస్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. ఇజ్రాయెల్ తమ తొలి టార్గెట్‌ మాత్రమేనని, యావత్‌ ప్రపంచంపై తమ ప్రభావాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హమాస్‌ కమాండర్‌ తమ సభ్యులకు ఓ సందేశం ఇచ్చాడు. ప్రపంచమంతా తమ చట్టం వచ్చేలా చేస్తామని అతడు చేసిన వ్యాఖ్యలు ఈ యుద్ధాన్ని మరింత రక్తసిక్తం చేసేలా కన్పిస్తోంది.

ఇజ్రాయెల్‌ కేవలం తమ ప్రారంభ టార్గెట్‌ మాత్రమేనని. యావత్‌ భూగోళం తమ చట్టం కిందకు రావాలని హమాస్‌ కమాండర్‌ మహ్‌మౌద్‌ అల్‌ జహార్‌ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యావత్‌ ప్రపంచంలో ఎలాంటి అన్యాయం, అణచివేత లేని వ్యవస్థ ఉండాలని.. లెబనాన్‌, సిరియా, ఇరాక్‌ వంటి దేశాల్లో అరబ్‌లు, పాలస్తీనీయన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు, హత్యలు ఇంకెక్కడా చోటుచేసుకోకూడదని ఈ వీడియో సందేశంలో మహ్​మౌద్ అల్ జహార్ పేర్కొన్నాడు. అతడితో పాటు ఈ వీడియోలో పలువురు హమాస్‌ సీనియర్‌ అధికారులు కనిపించారు.

హమాస్‌, లెబనాన్‌, సిరియాల నుంచీ ఇజ్రాయెల్‌ రాకెట్‌ దాడులను ఎదుర్కొంటున్న వేళ జహార్‌ వీడియో కలకలం రేపుతోంది. ఈ యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదముందని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version