విషాదం: 4100 మీటర్ల ఎత్తు నుండి స్కై డైవ్ చేసిన వృద్ధురాలు మృతి !

-

కొంతమంది గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించడానికి ఎంత రిస్క్ చేయడానికి అయినా సిద్ద పడుతూ ఉంటారు. అదే విధంగా రీసెంట్ గా అమెరికా లోని షికాగోకు చెందిన డొరొతీ హాఫ్ మాన్ అనే ఒక వృద్ధ మహిళ స్కై డైవ్ చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగా ఈమెకు సరిగ్గా 100 సంవత్సరాలు ఉన్న సమయంలో స్కై డైవ్ చేసింది.. కానీ అప్పుడు రికార్డును సొంతం చేసుకోలేకపోయింది. అప్పటి నుండి ఎలాగైనా సాధించాలి అనుకుంది, ఆ తర్వాత వారం రోజుల క్రితం 104 సంవత్సరాల వయసులో ఉండగా 4100 మీటర్ల ఎత్తు నుండి స్కై డైవ్ చేసి చివరకు తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. గిన్నిస్ రికార్డుకు అర్హత సాధించిన డొరొతీ ఆ పత్రాన్ని అందుకునే లోపు మరణించడం చాలా బాధాకరం అని చెప్పాలి.

ఈమె స్కై డైవ్ చేసిన కొన్ని రోజులలో మరణించినట్లు జాతీయ మీడియాలో పేర్కొంది. ఈమె బౌతికంగా గిన్నీస్ బొక్క అఫ్ రికార్డును తీసుకోలేకపోయినా , ఈమె పేరు మీద అది అలాగే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version