మరో ప్రాణాంతక వైరస్ ‘మెర్స్’ వచ్చేసింది.. WHO హెచ్చరిక

-

మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని భయపెట్టేందుకు వచ్చేసింది. కరోనా వైరస్ ఫ్యామిలీకి చెందిన ప్రాణాంతక మెర్స్‌-కోవ్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) కలకలం రేపుతోంది. అబుదాబీలో ఓ 28 ఏళ్ల యువకుడిలో మెర్స్​-కోవ్​ వైరస్‌ వెలుగు చూసింది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా నిర్ధరించింది. తడు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి పరీక్షించగా.. ఎవ్వరికి మెర్స్​-కోవ్​ వైరస్‌ సోకలేదని తెలిపింది.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అల్‌ ఐన్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల అనారోగ్యం బారిన పడగా అతడిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పీసీఆర్‌ పరీక్షలు జరపగా మెర్స్‌-కోవ్‌గా నిర్ధరణ అయ్యింది. అతడితో పాటు సన్నిహితంగా మెలిగిన 108 మందిని పరీక్షించగా.. ఎవ్వరిలోనూ వైరస్‌ జాడలు కనిపించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒంటెల వంటి జంతువుల నుంచే వైరస్​ సోకి ఉండవచ్చని అనుమానించారు. ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన ఈ వ్యక్తి ఒంటెలతో సమీపంగా మెలిగిన దాఖలాలు లేవని తెలుస్తోంది. మరోవైపు.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపైనా డబ్ల్యూహెచ్‌వో, యూఏఈ ఆరోగ్యశాఖ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news