అమెరికాలోని హవాయి ద్వీప సమూహంలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పుడు కెనడాకు వ్యాపించింది. అక్కడ వందల మందిని సజీవదహనం చేసి.. వేల ఇండ్లను దగ్ధం చేసిన కార్చిచ్చు ఇప్పుడు ఉత్తర కెనడాపై విరుచుకు పడుతోంది. నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్ నగరం వైపు అగ్నికీలల వేగంగా వ్యాపిస్తుండడం వల్ల ప్రజలంతా ఖాళీ చేయాలంటూ స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పుడు ఆ దావానలం పదుల కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ వారాంతంలో ఎల్లోనైఫ్ శివార్లకు సమీపిస్తుందని పేర్కొంది. ఆ నగరంలో ఉండాలనుకుంటే మీతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే అంటూ అప్రమత్తం చేసింది. ప్రజలను తరలించేందుకు విమానాలను సిద్ధంగా ఉంచామని నగర మేయర్ రెబెక్కా ఆల్టీ తెలిపారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించినట్లు చెప్పారు.
కెనడా వ్యాప్తంగా వెయ్యి 70 కార్చిచ్చులు క్రియాశీలకంగా ఉంటే నార్త్ వెస్ట్ టెర్రిటరీస్‌లోనే 230 ఉన్నాయని అగ్నిమాపక విభాగం పేర్కొంది. మంటలను అదుపు చేయడానికి 100 మంది సైనికులను పంపించినట్లు తెలిపింది.