ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్‌ షిప్ తొలి ప్రయాణానికి సిద్ధం

-

ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్‌ నౌక రాయల్‌ కరీబియన్‌ సంస్థకు చెందిన ‘ఐకాన్‌ ఆఫ్‌ ది సీస్‌’. ఈ నౌక తొలి ప్రయాణం ప్రారంభమైంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామీ పోర్టు నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం మయామీ పోర్టు నుంచి బయలుదేరిన ఈ నౌక వారం రోజుల పాటు సముద్ర జలాలపై విహరిస్తూ వివిధ దీవులను చుట్టేయనుంది. ఫిబ్రవరి 3న ఈ నౌక తిరిగి మయామీకి చేరుకోనుంది.

ఈ నౌక 365 మీటర్ల పొడవు, 20 డెక్కులున్నాయి. ఇందులో ఆరు వాటర్‌ స్లైడ్‌లు, ఏడు ఈత కొలనులు, ఐస్‌ స్కేటింగ్‌ రింక్, సినిమా థియేటర్, 40కి పైగా రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయి. కుటుంబాలతో ప్రయాణించే వారికి అత్యుత్తమ అనుభూతిని అందించేలా ఈ నౌకలో అధునాతన సౌకర్యాలు ఉన్నట్లు రాయల్‌ కరీబియన్‌ సంస్థ సీఈవో జాసన్‌ లిబర్టీ తెలిపారు. ఈ ఓడకు 2,350 మంది సిబ్బంది, 7,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉందని వెల్లడించారు. ఈ నౌక గంటకు గరిష్ఠంగా 22 నాటికల్‌ మైళ్ల (41 కి.మీ) వేగంలో ప్రయాణించగలదు.

Read more RELATED
Recommended to you

Latest news