శివ భగవానుడుని ఎన్నో పేర్ల తో ప్రతి నిత్యం భక్తులు అర్చిస్తూ ఉంటారు. అలాంటి శివునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఈ దేవాలయాలన్నిటిలో ఆ మహా శివుడు స్వయంభువుగా వెలిశాడు అని పురాణ కథనం. వీటిలో ఒకటైన త్రయంభకేశ్వర దేవాలయం ఒకటి.
మహారాష్ట్ర లో కల నాసిక్ నగరానికి 28 కి మీ దూరంలో ఈ ఆలయం ఉంది. త్రయంభకేశ్వర దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. దీనిని గోదావరి జన్మస్థానం అని అంటారు. త్రయంభకం అనగా స్వర్గం, ఆకాశం, భూమి ఈ మూడు ప్రాంతాలకు సంరక్షకుడు అయిన శివుడు అని అర్థం. అమ్భకం అనగా నేత్రం. మూడు నేత్రములు కలవాడు త్రయంబకుడు అంటారు. ఈ ఆలయాన్ని 1730 వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ సేనాదిపతి అయిన బాజీరావు పీష్వా నిర్మించినట్టు శాసనాలు చెపుతున్నాయి.
ఈ ఆలయం చుట్టూ నిర్మాణం లోపల చతురస్రాకారంగాను, బయటికి నక్షత్రాకారంలో ఉంటుంది. ఇక్కడ గల శివ లింగం భూమికి కొంత దిగువలో ఉంది. ఇక్కడ నిత్యం నీరు ఊరుతుంది. అది దేవాలయం పక్కన ఉన్న కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే సర్వ రోగాలు నివారించబడతాయని భక్తుల నమ్మకం. గౌతముడు శివుని మెప్పించి గంగను భూమికి తీసుకువచ్చు క్రమంలో బ్రహ్మగిరి వద్ద దిగి గోదావరిగా ప్రవహిస్తుంది