పండ్లపై ఉండే ‘స్టిక్కర్’కి అసలైన అర్ధం ఏంటో తెలుసా?

-

పండ్లు కొనుక్కోవడానికి మార్కెట్ కి వెళ్తే.. కొన్ని పండ్లపై స్టిక్కర్లు కనిపిస్తాయ్. ఆ స్టిక్కర్లు చూసి ఇవి బ్రాండెడ్ అని కొందరు తీసుకెళ్తుంటారు. కానీ అవి ఎందుకు అతికించారు? దానిపై ఏం రాసిందో ఎప్పుడైనా ఆలోచించారా..? అసలు ఆ స్టిక్కర్లు వేయడానికి గల కారణం ఏమిటి? అనేది ఎంతోమందికి తెలియదు. ఆ స్టిక్కర్లను ఎవరు వేశారు.. ఎందుకు వేశారు అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ఆ స్టిక్కర్లు పండ్లు ఏ విధంగా పండింది అనేది చెప్తాయ్. స్టికర్లు సహజసిద్ధంగా పండినవా లేక రసాయనాలతో పండినవా లేదా జన్యుపరమైన మార్పులతో పండినవా అనేది మనకు ఆ స్టిక్కర్ లే చెబుతాయి.

సాధారణంగా మనం పండ్లపై మూడు వేర్వేరు రకాల స్టిక్కర్లను గమనించే ఉంటాము. ఈ మూడు రకాల స్టిక్కర్లు ఒక్కొక్క స్టిక్కర్ ఒక అర్థాన్ని తెలియజేస్తాయి. అవి ఏంటి అంటే?

1. సాంప్రదాయ పద్దతిలో పండించబడిన పండు అయితే నాలుగు సంఖ్య నుంచి ప్రారంభమై నాలుగు అంకెలు ఉంటాయి.

2. అనారోగ్యానికి గురి చేసే జన్యుపరమైన మార్పులతో పండును పండించి ఉంటే ఎనిమిది సంఖ్యతో ప్రారంభమై అయిదు అంకెలు ఉంటాయి.

3. పండ్లను సేంద్రియంగా పండించినట్టు అయితే స్టిక్కర్ 9తో ప్రారంభమై 5 అంకెలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version