మొబైల్స్ తయారీదారు షియోమీ భారత్‌లో తమ కంపెనీకి చెందిన 3000వ స్టోర్‌ను ఓపెన్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ శహర్‌లో 3000వ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో దేశంలో మొత్తం 850 సిటీల్లో ప్రస్తుతం ఎంఐ స్టోర్స్ ఉన్నాయి. 2018లో షియోమీ ఆగస్టు 15న బెంగళూరులో తన తొలి ఎంఐ స్టోర్‌ను ప్రారంభించింది.
కాగా 2018 నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒకేసారి 500 ఎంఐ స్టోర్స్‌ను ప్రారంభించిన షియోమీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను కూడా సాధించింది. ఇక 2019 ఆగస్టు 12న తన 2000వ స్టోర్‌ను ఓపెన్ చేయగా.. ఇప్పుడు 3000వ స్టోర్‌ను లాంచ్ చేసింది.
కాగా ఈ స్టోర్ల ద్వారా ప్రస్తుతం 6వేల మందికి ఉపాధి లభిస్తోందని షియోమీ తెలిపింది. ఇక ఈ ఏడాది ఎంఐ ఇండియా తన 6వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఓ వీడియోను కూడా షియోమీ పోస్ట్ చేసింది.