Post office: కేంద్ర ప్రభుత్వం స్కీమ్.. రూ. 2 లక్షలు కడితే.. ఎంత వస్తుంది అంటే..?

-

చాలా మంది భవిష్యత్తు ని దృష్టి లో పెట్టుకుని డబ్బులని ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా మంచి స్కీమ్స్ లో డబ్బులని పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మధ్య తరగతి వారిని, నిరు పేదలను, మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్స్ తో ఎక్కువ వడ్డీ ని కూడా ఇస్తోంది. ఇటీవల 2023 బడ్జెట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం కొత్త స్కీమ్ ని తీసుకొచ్చింది. ఇక వాటి వివరాలు చూద్దాం. ఈ స్కీమ్ పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్.

ఈ స్కీమ్ కేవలం మహిళలకే. ఒకేసారి నగదు డిపాజిట్ చేయాలి. మహిళ లేదా పాప పేరు మీద ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టచ్చు. ఈ స్కీములో మీకు డబ్బులు కట్టిన రెండు సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. రెండేళ్లు లాక్‌ఇన్ పీరియడ్‌లో ఉండాలి. 7.5 శాతం వడ్డీ రేటును రెండేళ్ళకి పొందొచ్చు. ఇందులో మీరు కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాల్సి వుంది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెండేళ్ల లాకిన్ పీరియడ్‌ అయ్యాక 40 శాతం వరకు విత్‌డ్రా చెయ్యచ్చు.

ఇక అకౌంట్ హోల్డర్ చనిపోవడం లేదా ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నా, గార్డియన్ చనిపోవడం ఇలాంటివి ఏమి జరిగినా పెనాల్టీలు లేకుండానే ఎప్పుడైనా నగదు మొత్తం విత్‌డ్రా చెయ్యచ్చు. స్కీం నుంచి ముందే బయటికి రావాలనుకుంటే మీ వడ్డీ రేటులో 2 శాతం కట్ అవుతుంది. ఈ స్కీములో మీరు రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మొదటి త్రైమాసికం అంటే మూడు నెలలు ముగిసే సరికి వడ్డీ రూ.3750 వస్తుంది. రెండో క్వార్టర్ ముగిసే సరికి వడ్డీ రూ.3820 వస్తుంది. రెండు సంవత్సరాలు 8 త్రైమాసికాల్లో కలిపి 7.5 శాతం వడ్డీ రేటుకు రూ.2,32,044 మీకు ఇస్తారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version