ప్రపంచం వేగంగా మారుతోంది అందుకు తగ్గట్టుగా మన వ్యవసాయ రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతికతను జోడించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కొత్తతరం యువత ముందుకు వస్తోంది. ఈ యువత స్టార్టప్‌లను కొత్త వ్యాపార ఆలోచనలను (Agripreneurs) రంగంలోకి తెస్తోంది. అయితే వారి విజయానికి అతి ముఖ్యమైన అవసరం పెట్టుబడి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ అగ్రిప్రెన్యూర్లకు పెట్టుబడి మరియు స్వయం సహాయం (Self-Help) ఎలా తోడ్పడుతుందో ఇప్పుడు చూద్దాం.
వ్యవసాయ రంగంలో అగ్రిప్రెన్యూర్లు ఎదుర్కొనే ప్రధాన సమస్య నిధులు (Funding). కొత్త ఆలోచనలను అత్యాధునిక సాంకేతికతను పొలాలకు చేర్చడానికి భారీ పెట్టుబడి అవసరం. ప్రభుత్వం మరియు వివిధ ఆర్థిక సంస్థలు ఈ సమస్యను గుర్తించి స్టార్టప్‌లకు ప్రత్యేకంగా కొన్ని పథకాలను రూపొందించాయి. ఇవి కేవలం అప్పులు ఇవ్వడమే కాదు, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ మద్దతు కూడా అందిస్తాయి.

ప్రభుత్వ మద్దతు మరియు ఇంక్యుబేషన్: కేంద్ర ప్రభుత్వం ‘అగ్రి-కల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (AIF)’ వంటి పథకాల ద్వారా వ్యవసాయ స్టార్టప్‌లకు మూలధనాన్ని అందిస్తోంది. అంతేకాకుండా ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY)’ కింద, ఎగ్రిప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సెంటర్లు కొత్త వ్యాపార ఆలోచనలను పెంపొందించడానికి మార్కెట్ సంబంధిత జ్ఞానాన్ని అందించడానికి, మరియు పెట్టుబడిదారులను కలుసుకోవడానికి వేదికగా పనిచేస్తాయి. ఇక్కడ స్టార్టప్‌లు తమ ప్రొడక్టులను పరీక్షించుకోవడానికి మెరుగుపరచుకోవడానికి వీలుంటుంది.
స్వయం సహాయం ద్వారా నిధులు: పెట్టుబడి కోసం కేవలం ప్రభుత్వ పథకాలపై ఆధారపడకుండా ‘స్వయం సహాయ బృందాలు (Self-Help Groups – SHGs)’ మరియు ‘రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వంటి సామూహిక వేదికలు కూడా అగ్రిప్రెన్యూర్లకు గొప్ప మద్దతునిస్తున్నాయి.
SHGs: ఈ బృందాల సభ్యులు చిన్న మొత్తాలను పొదుపు చేసి ఆ నిధులను తమ బృందంలోని ఎగ్రిప్రెన్యూర్లకు తక్కువ వడ్డీకి ఇస్తారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో లేదా చిన్నపాటి వ్యాపార విస్తరణకు బాగా ఉపయోగపడుతుంది.
FPOs: పలువురు రైతులు కలిసి ఏర్పడే FPOలు, స్టార్టప్‌ల నుండి ఉత్పత్తులు,సేవలను కొనుగోలు చేయడం ద్వారా లేదా వారితో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం ద్వారా వారికి స్థిరమైన మార్కెట్‌ను అందిస్తాయి. దీనివల్ల స్టార్టప్‌లకు స్థిరమైన ఆదాయం లభించి, తద్వారా నిధులు సమకూర్చుకోవడం సులభమవుతుంది.
వ్యవసాయ రంగంలో స్టార్టప్‌ల విజయం అనేది పెట్టుబడి, సరైన మార్గదర్శకత్వం మరియు ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు స్వయం సహాయక వేదికల ద్వారా నిధులు సమకూర్చుకొని సాంకేతికతను వాడుకుంటే భారతీయ వ్యవసాయం తప్పక బంగారు పంట పండిస్తుంది.