వావ్‌.. కర్ణాటకలో త్వరలో ఐఫోన్లు తయారు

-

యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు త్వరలో కర్ణాటకలో తయారుకానున్నాయి. యాపిల్ కంపెనీకి చెందిన ఫాక్స్ కాన్ సంస్థ బెంగుళూరులో ఐఫోన్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఫాక్స్ కాన్ ఫ్యాక్టరీ కోసం కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరు ఎయిర్ పోర్టుకు దగ్గరలో 300 ఎకరాలు కేటాయించించింది. ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే వరల్డ్లోనే అతిపెద్ద ఐఫోన్ తయారీ క్యాంపస్లలో ఒకటిగా బెంగుళూరు క్యాంపస్ చోటు దక్కించుకోనుంది. 700 మిలియన్ డాలర్లతో ఫాక్స్ కాన్ సంస్థ ఈ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇందులో భాగంగా ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూతో కూడిన 17 మంది సభ్యుల ప్రతినిధి బృందం… బెంగళూరు శివారులోని క్యాంపస్ను సందర్శించింది.

భారత్లో ఫాక్స్ కాన్ సంస్థ ఇప్పటికే తమిళనాడులోని ప్లాంట్లో కొత్త జనరేషన్ ఐఫోన్లు తయారు చేస్తోంది. తాజాగా బెంగుళూరులోనూ ఫాక్స్ కాన్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఫాక్స్ కాన్ కు అమెరికా, చైనా, జపాన్ సహా ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో 173 క్యాంపస్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version