ipl-15: నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం… చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య తొలిపోరు

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) కు అంతా సిద్ధం అయింది. గత రెండు సీజన్లు మిస్ అయిన ఇండియా అభిమానులకు వినోదం పంచేందుకు మళ్లీ స్వదేశానికి వచ్చేసింది. కోవిడ్ కారణంగా గత రెండు సీజన్లు యూఏఈ వేదికగా జరిగాయి. తాాజాగా ఐపీఎల్-15 ఎడిషన్ నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. దీనికి తోడుగా 25 శాతం మందిని స్టేడియాల్లోకి అనుమతి ఇస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కొత్తగా గుజరాల్ టైటాన్స్, లక్నో సూపర్ జాయింట్స్ చేరడంతో.. ఈసారి జట్ల సంఖ్య 10కి చేరింది. 65 రోజుల పాటు 70 లీగ్ మ్యాచులు, 4 ప్లే ఆఫ్ మ్యాచులు జరగనున్నాయి, అభిమానులకు వినోదాన్ని పంచనున్నాయి. ముంబై, పుణేల్లోనే నాలుగు స్టేడియాల్లో ఈ మ్యాచులన్నీ జరుగనున్నాయి. 

ఈ రోజు నుంచి ఐపీఎల్ షురూ కానున్నాయి. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరనుంది. ఇక తర్వాతి రోజు మార్చి 27న ముంబై బ్రెబోర్న్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తరలపడతాయి. డీవై పాటల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తలపడనున్నాయి.

ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ 3 మరియు స్టార్ స్పోర్ట్స్ 3 హెచ్‌డి ఛానెల్‌లలో లైవ్ చూడవచ్చు. డిస్నీ హాట్ స్టార్, ఏయిర్ టెల్ టీవీ, జియో టీవీ ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ లో కూడా లైవ్ మ్యాచ్ స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version