Ipl 2021 qualifier 2: నేడే కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్

-

ఐపీఎల్ 2021 రెండవ సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లు మరియు ప్లే ఆప్స్ పూర్తికాగా ఇవాళ ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరగనుంది. క్వాలిఫైయర్ 2 లో భాగంగా… నేడు కోల్ కత్తా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇక ఈ మ్యాచ్ షార్జాలో ని.. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనుండగా.. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, లాంటి బ్యాట్స్ మెన్ లతో మంచి టచ్ లో ఢిల్లీ జట్టు ఉండగా… ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును ఓడించి మంచి ఫామ్ లోకి వచ్చింది కేకేఆర్ జట్టు. అయితే ఇవాళ జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news