ఐపీఎల్ 2023 : గుజరాత్ బౌలింగ్… ఢిల్లీ బోణీ కొట్టేనా ?

-

ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యన మ్యాచ్ ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంకాసేపట్లో మొదలు కానుంది. ఈ టోర్నీలో మొదటిసారి తలపడుతున్న ఈ జట్లు గెలుపే లక్ష్యంగా పోటీ పడనున్నాయి. కాగా మొదట టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఎప్పటిలాగే ఛేజింగ్ ను తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఛేజింగ్ లలో గుజరాత్ కు మంచి రికార్డ్ ఉంది. ఆ నమ్మకంతోనే కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా పంత్ గైర్హాజరీలో ఢిల్లీ టీం ను ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ముందుండి నడిపిస్తున్నాడు. ఆడిన మొదటి మ్యాచ్ లోనే లక్నో పై ఓటమి చెందిన ఢిల్లీ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలన్న కసితో బరిలోకి దిగనుంది. మరి చూద్దాం ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిని వరిస్తుందో ?

Read more RELATED
Recommended to you

Exit mobile version