ప్రస్తుతం చెన్నై వేదికగా ముంబై మరియు చెన్నై జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోని ఫీల్డింగ్ ఎంచుకుంది. తద్వారా మొదట బ్యాటింగ్ చేసిన ముంబై కష్టాల్లో పడింది. ఈసారి ఓపెనర్ లుగా వచ్చిన ఇషాన్ కిషన్ మరియు కెమరూన్ గ్రీన్ లు వచ్చినా.. సరైన స్టార్ట్ దక్కలేదు అని చెప్పాలి. మొదటి ఓవర్ లో 10 పరుగులు చేసి ఊపుమీద కనిపించిన ముంబై ఓపెనర్లు రెండవ ఓవర్ లోనే గ్రీన్ వికెట్ ను కోల్పోయింది. తుషార్ దేశ్ పాండే ఇతన్ని క్లీన్ బౌల్డ్ చేసి గట్టి షాక్ ఇచ్చాడు.. అనంతరం మూడవ ఓవర్ లో దీపక్ చాహర్ ఇషాన్ కిషన్ మరియు రోహిత్ శర్మలను అవుట్ చేసి ముంబైని పీకలోతు కష్టాల్లోకి నెట్టాడు.
ఐపీఎల్ 2023: కష్టాల్లో ముంబై… రోహిత్, ఇషాన్ , గ్రీన్ లు అవుట్ !
-