ఐపీఎల్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం ముంబై వేదికగా రోహిత్ మరియు హార్దిక్ పాండ్యాలు తమ తమ జట్లతో పోటీ పడనున్నాయి. ప్లే ఆఫ్ కు దగ్గర పడుతుండడంతో చివరి నాలుగు జట్లు ఏవో అన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. ఇక ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ప్రస్తుతం ఆడిన 11 మ్యాచ్ లలో ఆరు గెలిచి పాయింట్ లతో నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక ఈ జట్టుకు మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉండడంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ఈ మూడు మ్యాచ్ లలో ఏ ఒక్కటి ఓడినా మిగిలిన జట్ల ఫలితాల మీద ఆధారపడవలసి వస్తుంది. అందుకే గెలుపే ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం ముంబై అన్ని విభాగాలలో బలంగానే ఉంది.