ఐపిఎల్ 2023: పంజాబ్ ఎలిమినేటెడ్… రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం !

-

ఈ రోజు ఐపిఎల్ షెడ్యూల్ లో భాగంగా కీలక మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య ధర్మశాల వేదికగా జరిగింది. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బదులుగా పంజాబ్ నిర్ణీత ఓ ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు చేసింది. వాస్తవంగా పంజాబ్ కు ఇంత టోటల్ రావడం చాలా ఆశ్చర్యం అని చెప్పాలి. ఆఖరి 2 ఓవరాలో కరాన్ మరియు షారుఖ్ ఖాన్ లు 44 పరుగులు సాధించి పంజాబ్ కు ఛాలెంజింగ్ టోటల్ ను ఇచ్చారు. అనంతరం చేదనలో రాజస్థాన్ కు బట్లర్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జైస్వాల్ మరియు పడిక్కల్ (51) లు రెండవ వికెట్ కు 73 పరుగులు జోడించి జోడించి రాజస్థాన్ ను పోటీలో నిలిపారు, సంజు శాంసన్ కూడా 2 పరుగులకు ఔట్ అయ్యాడు. ఆ తర్వాత హెట్ మెయిర్ (46) తో కలిసి జైస్వాల్ (50) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

కానీ చివరి ఓవర్ కు 9 పరుగులు కావలసిన దశలో నాలుగవ బంతికి సిక్స్ కొట్టి జూరెల్ మ్యాచ్ ను గెలిపించాడు. ఈ విజయంతో రాజస్థాన్ కు ప్లే ఆఫ్ పై ఆశలు ఇంకా బ్రతికే ఉన్నాయి. కాగా పంజాబ్ 14 మ్యాచ్ లలో 6 మాత్రమే గెలవడంతో టోర్నీ నుండి ఎలిమినేట్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version