IPL 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ !

-

ఐపీఎల్ 2024 లో భాగంగా ఆదివారం (మే 12) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ వ్యవహరించనున్నాడు.ఈ సీజన్‌లో మూడోసారి స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసినందుకు గాను ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఐపీఎల్‌ యాజమాన్యం ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది.దాంతో బెంగళూరుతో మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ సారధ్య బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపారు.

గత రెండు సీజన్‌లుగా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా మంచి అనుభవం ఉంది. అక్షర్ తెలివైన వ్యక్తి. ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. కెప్టెన్సీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడు అని అన్నారు. అక్షర్ నేడు జట్టుతో సమావేశం అవుతాడు. జట్టును బాగా నడిపించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. రిషబ్ పంత్ దూరం కావడం మా దురదృష్టం. మేము బ్యాన్‌పై అప్పీల్ చేశాము. కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు’ అని రికీ పాంటింగ్ తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version