IPL 2024 : ఆల్ అవుట్ అయిన గుజరాత్… బెంగళూరు టార్గెట్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే మొదటగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది.

 

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్స్ సాహా 1, గిల్ 2 దారుణంగా నిరాశపరిచారు. ఇక ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ 6 విఫలమయ్యా రు. షారుక్ ఖాన్ 24 బంతుల్లో 37 పరుగులు, మిల్లర్ 20 బంతుల్లో 30 పరుగులు, తెవాటియా 35 పరుగులతో రాణించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, యశ్ చెరో రెండు వికెట్లు తీయగా, గ్రీన్, కరణ్ శర్మ చెరో వికెట్ తీశారు. వైశాఖ్ వేసిన చివరి ఓవర్ తొలి 3 బంతులకు 3 వికెట్లు పడ్డాయి. తొలి బంతికి మనవ్ సుతార్ (క్యాచ్), రెండో బంతికి మోహిత్(రనౌట్), మూడో బంతికి విజయ్ (క్యాచ్) ఔటయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news