IPL 2024 : విజృంభించిన గుజరాత్ ఓపెనర్స్… చెన్నై టార్గెట్ ఎంతంటే?

-

ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య 59వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 231/3 స్కోర్ చేసింది.

 

ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్స్ ఇద్దరు కూడా సెంచరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.కెప్టెన్ శుభ్మన్ గిల్ 50 బంతుల్లో శతకం బాదారు. ఇందులో 6 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్లో గిల్కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.ఇక మరో ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా సెంచరీతో చెలరేగారు. 50 బంతుల్లో శతకం బాదారు. ఇందులో 7 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఇదే క్రమంలో IPLలో అత్యంత వేగంగా(25 ఇన్నింగ్స్ లు) 1,000 పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్గా సుదర్శన్ సరికొత్త రికార్డు సృష్టించారు. సచిన్, రుతురాజ్ 31 ఇన్నింగ్స్లో వెయ్యి రన్స్ చేశారు.ఇక మిల్లర్ 16*, షారుఖ్ ఖాన్ 2 పరుగులు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ లో తుషార్ దేశ్పాండే రెండు వికెట్లు తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news