IPL 2024 : క్రిస్ గేల్ రికార్డు సమం చేసిన డేవిడ్ వార్నర్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్లో రికార్డు సృష్టించారు. చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ఆయన అర్ధ సెంచరీ బాదారు. దీంతో కలుపుకుని ఆయన ఇప్పటివరకు 110 ఫిఫ్టీలు సాధించారు. ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసకవీరుడు క్రిస్ గేల్ (110) రికార్డును సమం చేశారు. కాగా వార్నర్ ఐపీఎల్లో 62 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆయన ఖాతాలో 4 శతకాలు కూడా ఉన్నాయి.

కాగా, టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పృథ్వీ షా 27 బంతుల్లో 43 పరుగులు చేయగా డివిడి వార్నర్ 35 బంతులు ఆడి 52 పరుగులు చేశాడు. మరోవైపు రిషబ్ పంత్ అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు.మార్ష్ 18 పరుగులు చేయగా స్తబ్స్ డక్ అవుట్ అయ్యాడు. అక్షర పటేల్ 7 పరుగులతో, అభిషేకు పొరెల్ 9 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో పతిరాన రాను 3 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా ముస్తఫీజ్ రహమాన్ చెరో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news