ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది .ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ 89 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. ఢిల్లీ బౌలర్ల దాటికి గుజరాత్ ఏ దశలోను కోల్గోలేకపోయింది.
మొదటగా బ్యాటింగ్ ఆరంభించిన గుజరాత్ టైటాన్స్ లో ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. వృద్ధి మాన్ సహా పది బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక గుజరాత్ కెప్టెన్ గిల్ 6 బంతుల్లో 8పరుగులు మాత్రమే చేశాడు. సాయి సుదర్శన్ 10 పరుగులు,మిల్లర్ 2 పరుగులు, షారుక్ ఖాన్ డక్ అవుట్ అయ్యాడు. ఇక రషీద్ ఖాన్ తప్ప మిగిలిన బ్యాటర్లు కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.రషీద్ ఖాన్ ఒక్కడే 31 పరుగులు చేశారు. ముకేశ్ కుమార్ 3, ఇషాంత్ శర్మ, స్టబ్స్ రెండేసి వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్ ని కట్టడి చేశారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే అత్యల్ప స్కోర్. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ పై ముంబై 125 పరుగులు చేసింది.