IPL 2024 : ముగిసిన కోల్కత్తా మొదటి ఇన్నింగ్స్… స్కోర్ ఎంతంటే..?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ నిన్న అట్టహాసంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈడెన్ గార్డెన్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్లో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఇక బ్యాటింగ్ కి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

 

రస్సెల్ 25 బంతుల్లో 64 రన్స్లో మెరుపులు మెరిపించారు. ఆరంభంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస వికెట్లు తీసి పట్టు బిగించినట్లే కనిపించినా.. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ పుంజుకుని ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసింది. సాల్ట్ (54), రమణ్ దీప్(35), రింకూ (23) రాణించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ లక్ష్యం 209 రన్స్.

Read more RELATED
Recommended to you

Latest news