అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న మార్క్‌రమ్ ని గత రెండు సీజన్ లకి హైదరాబాద్ ఫ్రాంచైజ్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.అయితే ఆ నమ్మకాన్ని మార్కరం నిలబెట్టుకోలేకపోయాడు. రెండు సీజన్ లలోనూ సన్ రైజర్స్ జట్టు ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది.గత సీజన్ లో 14 మ్యాచ్ ల్లో కేవలం 4 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించి 10 ఓడిపోయింది. దీంతో అతనిపై సన్ రైజర్స్ అతనిపై వేటు వేసింది.అతని స్థానంలో ఆసీస్ సారధి కమిన్స్ ను కెప్టెన్ గా ప్రకటిస్తున్నట్లు సన్ రైజర్స్ అధికారికంగా ప్రకటించింది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. కనీసం అతనికి తుది జట్టులో అవకాశం కూడా కష్టంగానే కనిపిస్తుంది.ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టులో కెప్టెన్ కమ్మిన్స్ తో పాటు క్లాసన్, మార్కో జాన్సెన్,ట్రావిస్ హెడ్, హసరంగా, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వరల్డ్ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. వీరు మార్కరం కు గట్టి పోటీ ఇవ్వొచ్చు. తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు అనే నిబంధన ఉండడంతో కమ్మిన్స్, హెడ్, క్లాసన్, హసరంగా/జాన్సెన్ లలో ఒకరిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే మార్కరంకు నిరాశ తప్పకపోవచ్చు.