మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, బీఎస్పీలు ఒక్కటయ్యాయి. మంగళవారం హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో భేటీ అయిన ఇరు పార్టీల అధినేతలు కేసీఆర్, rs ప్రవీణ్ కుమార్ పొత్తు ప్రకటించారు.తాజాగా.. ఈ పొత్తుపై కాంగ్రెస్ నేత మల్లు రవి స్పందిస్తూ…ఎన్నికల వేళ రాజకీయాల్లో పొత్తులు సర్వసాధారణం అని ,కేంద్రంలో ఏర్పడిన ఇండియా కూటమిలో బీఎస్పీ లేదని, అందుకే బీఆర్ఎస్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారని అన్నారు.
నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు నాకే వస్తుందన్న నమ్మకం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక వేళ తనకు టికెట్ కేటాయింపు ఖరారైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,కేసీఆర్ పోటీ చేసినా ఓడిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముందుంది మొత్తం కాంగ్రెస్ కాలమే అని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారు. RS ప్రవీణ్ కుమార్ మునిగిపోయే నావలో కూర్చున్నారని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు.