IPL 2024 : ఐపీఎల్ లో మ్యాక్స్ వెల్ చెత్త రికార్డు!

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , ముంబై ఇండియన్స్ మధ్య 25 వ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. వాంఖడేలో ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ స్టార్లు విరాట్, మ్యాక్స్వెల్ విఫలమయ్యారు. కోహ్లి 9 బంతుల్లో 3 రన్స్ కి ఔట్ కాగా మ్యాక్స్వెల్ 4 బంతులాడి డకౌట్ అయ్యారు. ఈక్రమంలో మ్యాక్సీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఐపీఎల్లో అత్యధికసార్లు(17) డకౌటైన ఆటగాడిగా దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ సరసన చేరారు.

కాగా, ఈ మ్యాచ్ లో రజత్ పాటిదర్ హాఫ్ సెంచరీ తో రాణించాడు.మహిపాల్ లామ్రార్, విజయ్ కుమార్ డక్ ఔట్ అయ్యారు. ఇక చివర్లో దినేష్ కార్తీక్ బంతుల్లో 5 బౌండరీలు , 4 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా నిప్పులు చెరిగారు. ఐదు వికెట్లతో చెలరేగారు. ముంబై బౌలర్లలో కొయెట్టీ, మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news