IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా మరో ఆసక్తికరమైన మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ జైపుర్ వేదికగా 7: 30 pm గంటలకు ప్రారంభం కానుంది.

రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్లో టాపర్ గా ఉంది. ఇక ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే ముంబై ఇండియన్స్ 15 గెలవగా.. రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచుల్లో గెలిచింది. ఇక ఈరోజు మ్యాచ్ జరుగుతున్న జైపుర్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన 7 మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ 5 గెలిచింది. దీంతో ముంబైకి నేడు కఠిన పరీక్ష ఎదురుకానుంది.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ, ఇషాన్, సూర్య కుమార్, తిలక్ వర్మ, హార్దిక్(C), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కోయెట్టీ, నబీ, పీయూష్ చావ్లా, బుమ్రా.

 

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : జైస్వాల్, శాంసన్(C), పరాగ్, హెట్మెయర్, జురెల్, పావెల్, రవిచంద్రన్ అశ్విన్, బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version