IPL 2024 : ముగిసిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్… గుజరాత్ టార్గెట్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్ ,గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 142 స్కోరుకే ఆలౌటైంది.

అనంతరం ఓపెనర్లు కర్రాన్ 19 బంతుల్లో 30 పరుగులు, ప్రభుసిమ్రాన్ సింగ్ 21 బంతుల్లో 35 పరుగులు చేసి చక్కటి ఆరంభాన్ని అందించారు. అయితే, మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు స్కోర్ సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు.జితేష్ శర్మ 12 బంతుల్లో 13 పరుగులు చేయగా.. రిలీ రొస్సొ, లియామ్ లివింగ్టన్, శషాంక్ సింగ్, అశుతోష్ శర్మ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.

హరీత్ బ్రార్ 29 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిశోర్ వికెట్లు, మోహిత్ శర్మ 2 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news