రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి సోదరులు తోడైతే ఎవరూ తట్టుకోలేరు : రాజగోపాల్ రెడ్డి

-

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం భువనగిరి పట్టణ కేంద్రంలో నిర్వహించిన ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు పాల్గొన్నారుఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి మా సోదరులం చెరో భుజంగా ఉన్నామని అన్నారు. రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి సోదరులు తోడైతే ఎవరూ తట్టుకోలేరు అని అన్నారు.

బీఆర్ఎస్‌లో అప్పుల పాలైన తెలంగాణను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. భువనగిరి లోక్ సభ సీటును గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని అన్నారు.భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యత నాదే అని, అభివృద్ధి బాధ్యత రేవంత్ రెడ్డి చూసుకుంటారు.. గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్లుగా 12లో 11 స్థానాలు గెలుచుకున్నాం.. సూర్యాపేట సీటు కొంచెంలో మిస్ అయింది అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి స్థానాల్లో కాంగ్రెస్‌కు బంపర్ మెజార్టీ రాబోతోందని ఆశా భావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news