IPL 2024 : పంజాబ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు తొలి వికెట్ కు 27 పరుగులు జోడించారు.అతర్వ 15 పరుగులు, జానీ బేర్ స్టో 15 పరుగులు చేసి అవుట్ అయ్యారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ కూడా దారుణంగా విఫలమయ్యారు.

శశాంక్ సింగ్ 9 పరుగులు చేయగా ప్రభ సిమ్రాన్సింగ్ 10 పరుగులు, సామ్ కరణ్ 6 పరుగులు మాత్రమే చేశారు. చివరిలో లివింగ్స్టో న్ 21 పరుగులు, అష్టోస్ శర్మ 31 పరుగులు చేసి పంజాబ్ కి గౌరవప్రదమైన స్కోర్ ని అందించారు.ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్,కేశవ మహారాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. బౌల్ట్,కూల్డీప్ , చాహళ్ చెరో వికెట్ తీశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news