సీఎం జగన్ పైకి రాయి..ఎడమ కంటికి గాయం

-

విజయవాడలో సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటి దగ్గర గాయమైంది.రాయి బలంగా తగలడంతో కన్ను వాచింది. CMRF హరికృష్ణ గారు ఫస్ట్ ఎయిడ్ చేశారు .ప్రాథమిక చికిత్స అనంతరం బస్సు యాత్ర కొనసాగుతోంది.

ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది.సీఎంపై రాళ్ల దాడి జరగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది సీఎంపై రాళ్లు రువ్విన ఆగంతకులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. కాగా, ఈ సంఘటన కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news