నీటి ఎద్దడిపై టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు : పొన్నం ప్రభాకర్

-

హైదరాబాద్లో నీటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రజలు 155313 నంబరుకు కాల్ చేయాలని ఆయన సూచించారు.వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వేసవి లో నీటి ఇబ్బంది ఉంది అని చెప్పారు గతంలో హైదరాబాద్ నీటి అవసరాలకి 2300 mld ఇప్పుడు 2450 mld నీరు సరఫరా చేస్తున్నాము.

700 ట్యాంకర్ల ద్వారా సిటీలో నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూర్లో నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నామని పొన్నం చెప్పారు.హైదరాబాద్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడిన 155313 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయొచ్చు.ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయి అని మండిపడ్డారు.గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నీటిని డ్రా చేస్తున్నాం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news