IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి .ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.

చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభ కానుంది.క్వాలిఫయర్-2 మ్యాచ్ కు రంగం సిద్ధం కావడంతో టైటిల్ పోరులో కోల్కతాను ఢీకొట్టే జట్టేదో నేడు తేలనుంది.ఇరుజట్లు బలంగా కనిపిస్తుండటంతో పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఈ జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడగా హైదరాబాద్ 10, రాజస్థాన్ 9 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ నెగ్గింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ : హెడ్, అభిషేక్, రాహుల్ త్రిపాఠి, మార్కమ్, క్లాసెన్, నితీశ్, సమద్, కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్, ఉనద్కత్.

 

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : కాడ్మోర్, జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్, జురెల్, పావెల్, అశ్విన్, చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ, అవేశ్

Read more RELATED
Recommended to you

Latest news